: మంచు సముద్రం కింద మంచుకాలువలు


అదో భారీ మంచు సముద్రం... పైకి చూడడానికి సువిశాలంగా విస్తరించివున్న గడ్డకట్టివున్న మంచు. కనుచూపుమేర విస్తరించుకుని వున్న మంచే కనిపిస్తుంటుంది. అయితే ఈ మంచు సముద్రం కింద మంచు కాలువలు ప్రవహిస్తున్నాయంటే... ఆశ్చర్యం కలుగుతుంది కదూ... శాస్త్రవేత్తలకు సరిగ్గా ఇలాంటి ఆశ్చర్యమే కలిగింది. విశాలమైన అంటార్కిటిక్‌ సముద్రంలో తేలుతున్న సువిశాల హిమఫలకం కింద సుమారు 250 మీటర్ల లోతైన భారీ మంచుకాలువలను పరిశోధకులు కనుగొన్నారు.

బ్రిస్టల్‌, న్యూకేస్టిల్‌, ఎక్సెటర్‌ తదితర విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు ఉపగ్రహ చిత్రాల ఆధారంగా అంటార్కిటిక్‌ సముద్రంలో భారీ మంచుకాలువలను కనుగొన్నారు. ఈ కాలువలు ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌ అంత ఎత్తున వందల కిలోమీటర్ల మేరా విస్తరించి వున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధకులు వీటిని గుర్తించారు. ఈ కాలువల గురించి ఎక్సెటర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ అన్నె లీ బ్రాక్‌ మాట్లాడుతూ హిమఫలకం మందం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ కాలువల ఉనికిని ఫలకం ఉపరితలంపైనే గుర్తించవచ్చని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News