: మార్క్ ఫెడ్ డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏడుగురు అభ్యర్థులు


రాష్ట్ర సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం 31 మంది నామినేషన్ వేయగా.. 24మంది పోటీలోంచి విరమించారు. దీంతో డైరెక్టర్లుగా కొవ్వూరి వెంకట సత్యనారాయణ-తూర్పుగోదావరి, కంచి రామారావు-కృష్ణా, కేవీ సూర్యనారాయణ రాజు-విజయనగరం, పీపీ నాగిరెడ్డి-కర్నూల్, సీహెచ్ లింగారెడ్డి- వరంగల్, కె సోమశేఖర్ రావు-నిజామాబాద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని మంత్రులు పార్థసారధి, పితాని సత్యనారాయణ తెలిపారు. మరోవైపు శనివారం (మార్చి 2వ తేదీన) మార్క్ ఫెడ్ ఛైర్మన్ పదవికి నామినేషన్ జరుగుతుందని ఎన్నికల అధికారి చెప్పారు.

  • Loading...

More Telugu News