: ఎస్ బీఐ పగ్గాలు చేపట్టిన మహిళ


అగ్రగామి ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) పగ్గాలు తొలిసారి ఓ మహిళ చేపట్టనున్నారు. అరుంధతి భట్టాచార్య (55) ఎస్ బీఐ చైర్ పర్సన్ గా నేడు నియమితులయ్యారు. 207 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఎస్ బీఐ ప్రస్థానంలో ఓ మహిళ ఈ పదవిని అధిష్ఠించడం ఇదే ప్రథమం. సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేసిన ప్రతిప్ చౌధరి స్థానంలో అరుంధతి బాధ్యతలు స్వీకరించనున్నారు. 1977లో ప్రొబేషనరీ ఆఫీసర్ గా ఎస్ బీఐలో ప్రవేశించిన ఈ మహిళ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, కార్పొరేట్ డెవలప్ మెంట్ ఆఫీసర్, చీఫ్ జనరల్ మేనేజర్ గానూ వ్యవహరించారు.

  • Loading...

More Telugu News