: సీఎం కిరణ్ నోట మళ్లీ అదే మాట!
రాష్ట్రం విడిపోవడం కన్నా కలిసుంటేనే ప్రజలకు మంచిదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను విభజించాలని తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైనదని పేర్కొన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం రాజకీయ నిర్ణయమన్నారు. దాంతో, కాంగ్రెస్ ప్రజల్లో పెద్ద సమస్యను సృష్టించిందని వ్యాఖ్యానించారు. అందుకే ప్రజలు విభజనపై, కాంగ్రెస్ పార్టీపై తీవ్రం ఆగ్రహం వెళ్లగక్కుతున్నారని ఓ ఆంగ్ల ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు. తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమానికి తన మద్దతులేదని స్పష్టం చేశారు. ప్రజల మంచికోసమే తాను ఈ విధంగా చేస్తున్నానన్న కిరణ్, తాను ఎవరివైపు లేనని, సమైక్యాంధ్రే తన లక్ష్యమని చెప్పారు.