: రేపటి నుంచి విధులకు దూరం: సీమాంధ్ర కేంద్ర మంత్రులు


ప్రధానితో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ ముగిసింది. అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచి తాము విధులకు హాజరు కాబోవడంలేదని ప్రధానికి స్పష్టం చేశామని పురందేశ్వరి తెలిపారు. తమ రాజీనామాలు ఆమోదించాలని ఆయనను కోరామని చెప్పారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తాము నడుచుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్ళాలంటే పదవులు అడ్డంకి అని, అందుకే తమ రాజీనామాలు అంగీకరించాల్సిందేనని ప్రధానిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశామన్నారు. భేటీ సందర్భంగా చిరంజీవి, పురందేశ్వరి, కోట్ల, పళ్ళంరాజు తమ రాజీనామా లేఖలను ప్రధానికి సమర్పించారు.

  • Loading...

More Telugu News