: తెలంగాణ ఉద్యమం ఎప్పటినుంచో ఉంది: డీఎస్


తెలంగాణ ఉద్యమం ఇప్పటిది కాదని, 1956 నుంచే ఉందని పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 1969లో ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకోగా, పోలీసు కాల్పుల్లో వందల సంఖ్యలో యువకులు బలయ్యారని తెలిపారు. 1969, 1972 సంవత్సరాల్లో ఉద్యమం పతాకస్థాయికి చేరుకోగా, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో రెండు ప్రాంతాల మధ్య అనేక ఒప్పందాలు జరిగాయని డీఎస్ పేర్కొన్నారు. కాగా, ఎన్డీయే సర్కారు హయాంలో కొత్తగా మూడు రాష్ట్రాలు ఏర్పడడంతో, తెలంగాణలోనూ ఉద్యమం పుంజుకుందని చెప్పారు.

  • Loading...

More Telugu News