: బాబుపై లక్ష్మీపార్వతి మండిపాటు


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించడంపై లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఢిల్లీలో దీక్షకు ముందు బాబు ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి నివాళులర్పించిన సంగతి తెలిసిందే. దీనిపై లక్ష్మీపార్వతి మాట్లాడుతూ, తెలుగువాళ్ళంతా ఒక్కటిగా ఉండాలని ఎన్టీఆర్ కోరుకుంటే, విభజనకు అంగీకరించిన బాబు ఆయన సమాధి వద్దకు రావడమేంటని ప్రశ్నించారు. బాబు తన స్వార్థ రాజకీయాల కోసం ఎన్టీఆర్ ను ఉపయోగించుకుంటున్నాడని ఆమె ఆరోపించారు. బాబు ఢిల్లీలో దీక్ష చేయాలని నిర్ణయించుకోవడం వ్యూహాత్మకమని అన్నారు. జాతీయ నేతల్లో తన పలుకుబడి చాటుకోవడానికే బాబు ఈ ఎత్తుగడ వేశారని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News