: బాబుకు ఎన్నారైల సంఘీభావం


విభజన అంశంలో కాంగ్రెస్ నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టిన నిరాహారదీక్షకు ఎన్నారైలు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు టీడీపీ ఎన్నారై నేతలు అమెరికాలోని కాలిఫోర్నియాలో సంఘీభావ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం సీమాంధ్ర ప్రజలను బలిపశువులను చేస్తోందని ఎన్నారై నేత శ్రీనివాస్ కొమ్మినేని ఆరోపించారు. మరో నేత అశోక్ దాచర్ల మాట్లాడుతూ.. జగన్ వైఖరి చూస్తుంటే ఒక చోట దెబ్బ తగిలితే మరో చోట మందు పూసినట్టుందని విమర్శించారు. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ను వదిలేసి అందరూ టీడీపీని నిందించడం తగదన్నారు. సమన్యాయం కోసం దీక్ష చేస్తున్న చంద్రబాబుకు అందరూ మద్దతివ్వాలని మరో నేత వెంకట్ కొడాలి సూచించారు.

  • Loading...

More Telugu News