: కాంగ్రెస్ ను వీడాలంటే బాధగా ఉంది: జేసీ
విభజన పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న వైఖరిపై మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. పార్టీని వీడాలంటే చాలా బాధగా ఉందన్నారు. కాంగ్రెస్ ను వీడినా.. ఇతర పార్టీల్లోకి వెళ్లనని స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం మూగ, చెవిటి, గుడ్డిదని వ్యాఖ్యానించారు. అందువల్లే రాష్ట్ర విభజన విషయంలో మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు.