: బాబ్లీ వివాదంతో రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టొద్దు: సుదర్శన్ రెడ్డి
బాబ్లీతో ఆంధ్ర, మహారాష్ట్ర ల మధ్య చిచ్చు పెట్టవద్దని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రతిపక్షాలకు హితవు పలికారు. బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు తీర్పు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని ఆయన అన్నారు.
ఈ రెండు రాష్ట్రాలు కలిసి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు చేపడుతున్నాయని..ఇలాంటి సమయంలో రాజకీయాలతో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టడం మంచిది కాదని సుదర్శన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈ రెండు రాష్ట్రాలు కలిసి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు చేపడుతున్నాయని..ఇలాంటి సమయంలో రాజకీయాలతో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టడం మంచిది కాదని సుదర్శన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.