: విభజన ఎలా బాగుంటుందో బాబే చెప్పాలి: దిగ్విజయ్
రాష్ట్ర విభజన తీరు సరిగా లేదంటూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబడుతుండడంపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ స్పందించారు. రాష్ట్రాన్ని ఎలా విభజిస్తే బాగుంటుందో చంద్రబాబే చెప్పాలని సూచించారు. సీమాంధ్రులు ఆందోళలను విరమించాలని మరోసారి కోరారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆస్తులపై దాడుల గురించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడానని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.