: ఢిల్లీలో చంద్రబాబు దీక్ష ప్రారంభం
రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్షను ఈ ఉదయం ఢిల్లీలో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజకీయ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమంటూ ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం సరైన విధానాన్ని అనుసరించడం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వాటికి కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలన్నారు.