: నటి జీవితారాజశేఖర్ కు అరెస్ట్ వారెంట్


చెక్ బౌన్స్ కేసులో సినీనటి జీవితారాజశేఖర్ కు హైదరాబాద్ నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ నెల 29లోగా జీవితను తమ ముందు హాజరుపర్చాలని జూబ్లీహిల్స్ పోలీసులను కోర్టు ఆదేశించింది. రిటైర్డ్ సేల్స్ టాక్స్ కమిషనర్ పరంధామరెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.36 లక్షలు తీసుకున్న జీవిత అందుకు చెక్ ఇచ్చారు. అయితే, అది బౌన్స్ కావడంతో సదరు వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇందుకు రెండుసార్లు న్యాయస్థానం ఎదుట వాయిదాకు ఆమె గైర్హాజరయ్యారు. దాంతో, కోర్టు వారెంట్ ఇచ్చింది.

  • Loading...

More Telugu News