: పెంచిన రైల్వే చార్జీలు నేటినుంచే అమల్లోకి
రైల్వేశాఖ పెంచిన ఛార్జీలు నేటినుంచే అమల్లోకి రానున్నాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే టిక్కెట్లు పొందిన ప్రయాణికులు రైళ్లలోని టీటీఈలకు పెరిగిన ఛార్జీలను చెల్లించి రశీదును పొందవచ్చని రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. ప్రయాణించే దూరం ఆధారంగా ఈ ఛార్జీలు పెరిగాయని చెప్పారు.