: ఆలోచనలు మారుతున్నాయి


యువత ఆలోచనా విధానంలో క్రమేపీ మార్పులు వస్తున్నాయట. ముఖ్యంగా తమ ఆరోగ్యంపైన, ఆకారంపైన యువతకు శ్రద్ధ బాగా పెరుగుతోందట. గతంలో లాగా పొద్దునే లేవడానికి బద్దకించకపోగా ఉదయాన్నే లేచి చక్కగా వాకింగ్‌, జాగింగ్‌ వంటి వాటితోబాటు చక్కటి వ్యాయామం చేయడానికి ఉత్సుకత చూపుతున్నారని, ఊబకాయం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది.

అమెరికాలోని మసాచుసెట్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పదేళ్లపాటు నిర్వహించిన ప్రత్యేక అధ్యయనంలో యువత పొద్దునే లేచి వాకింగ్‌, జాగింగ్‌, యోగా వంటి పలు రకాలైన ఆరోగ్యపు అలవాట్లను తమ దైనందిన జీవితంలో భాగంగా మార్చుకుంటున్నారట. అంతేకాదు, గతంలోలాగా శరీరానికి హాని కలిగించే జంక్‌ ఫుడ్‌పై ఉండే ఇష్టాన్ని కూడా క్రమేపీ తగ్గించుకుంటూ పోషకాహారానికి తగు ప్రాధాన్యతనివ్వడం కూడా జరుగుతోందని ఈ సర్వేలో తేలింది. ఇలాంటి చక్కటి అలవాట్లవల్ల ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య కూడా క్రమేపీ తగ్గుతోందని, ఊబకాయం తగ్గడంతో వారు చురుగ్గా ఉండగలుగుతున్నారని ఈ సర్వే నిర్వహించిన అధ్యయనవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News