: రూ. 5800 కోట్లతో చిత్తూరు జిల్లాకు తాగునీటి ప్రాజెక్టు
చిత్తూరు జిల్లా వాసుల తాగునీటి కష్టాలను తీర్చేందుకు భారీ నీటి ప్రాజెక్టుకు సీఎం ఆమోదముద్ర వేశారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 5800 కోట్లు వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టుతో చిత్తూరు జిల్లాలో తాగునీటి సమస్య పూర్తిగా తీరిపోతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా మొదటి దశలో 8468 ఆవాస ప్రాంతాలకు, రెండో దశలో 2449 ఆవాస ప్రాంతాలకు తాగునీటి సదుపాయం కలగనుంది.