: ఆది, సోమవారాల్లో పలు రైళ్లు రద్దు
విద్యుత్ సంక్షోభం దక్షిణ మధ్య రైల్వేను కుదిపేస్తోంది. రైళ్లు నడవటానికి అవసరమైన విద్యుత్తు సరఫరా పడిపోవడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ద.మ.రైల్వే ప్రకటించింది. ఆది, సోమవారాల్లో 9 రైళ్లను పూర్తిగా, 4 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు సీపీఆర్వో సాంబశివరావు తెలిపారు. వీటిలో చెన్నై-విజయవాడ మధ్య నడిచే పినాకిని, జనశతాబ్ది ఎక్స్ ప్రెస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఈ రోజు సాయంత్రం తిరుపతి నుంచి బయలుదేరాల్సిన పద్మావతి, నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లను రేణిగుంట, గుత్తి, డోన్, కాచిగూడల మీదుగా మళ్లించిన మార్గంలో నడుపుతున్నట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైళ్లను డీజిల్ ఇంజిన్లతో నడిపేందుకు ద.మ.రైల్వే ఏర్పాట్లు చేస్తోంది.