: కనిపిస్తే కాల్చివేస్తాం : విజయనగరం ఎస్పీ
పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ విజయనగరంలో పరిస్థితి అదుపులోకి రావట్లేదు. సమైక్యాంధ్ర ఆందోళనకారులు చెలరేగిపోతూనే ఉన్నారు. మహిళలు కూడా రోడ్ల మీదకు వచ్చి పోలీసులకు వ్యతిరేకంగా తొడగొడుతున్నారు. ఆందోళనకారులను అణచివేసేందుకు పోలీసులు ఇప్పటికే 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం ఎస్పీ కార్తికేయ మాట్లాడుతూ... ప్రజలెవరూ రోడ్ల మీదకు రాకూడదని తెలిపారు. నగరంలో కర్ఫ్యూ కొనసాగుతోందని తెలిపారు. ఎవరైనా వీధుల్లో కనిపిస్తే కాల్చివేయాలని ఉత్తర్వులు జారీచేసినట్టు ప్రకటించారు.