: అంధకారంలో రాయలసీమ
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో రాయలసీమలో అంధకారం నెలకొంది. సీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చిత్తూరు జిల్లాలో పాక్షికంగా కరెంట్ సరఫరా ఆగిపోయింది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, తంబళ్లపల్లి డివిజన్లలో దాదాపు 400 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.