: దోపిడీ కోసమే జగన్ దీక్ష : కడియం


తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకుని మరింత దోచుకోవడానికే వైసీపీ అధ్యక్షుడు జగన్ దీక్ష చేస్తున్నారని తెరాస నేత కడియం శ్రీహరి ఘాటుగా విమర్శించారు. వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జగన్, ఢిల్లీలో చంద్రబాబు దీక్షలు, వచ్చిన తెలంగాణను అడ్డుకునేందుకేనని విమర్శించారు. స్కీంల పేరుతో స్కాంలు చేసేందుకే జగన్ దీక్ష పేరుతో నాటకం ఆడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ పై కిరికిరి పెడితే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని కడియం హెచ్చరించారు.

  • Loading...

More Telugu News