: పండగ వేళ ఏటీఎం గడప తొక్కుతున్నారా...?


దేవీ నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు దసరా సెలవుల హంగామా కూడా మొదలైంది. వారంలో రానున్న పండగ కోసం ముందుగానే నోట్లు సిద్ధంగా ఉంచుకోవడం బెటర్. ఎందుకంటే ఏటీఎం మెషిన్లలో నోట్లను నింపే ఏజెన్సీలలో సెక్యూరిటీ సిబ్బంది తగ్గిపోవడమే దీనికి కారణం. 6 నెలల కిందట ఏజెన్సీలలో ఉన్న సాయుధ రక్షణ సిబ్బందిలో ఒక వంతు మంది ప్రస్తుతం పని మానేశారు. ఇక ఉన్న వారు కూడా దసరా సెలవుల సందర్భంగా సెలవుపై వెళ్లే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఏటీఎం యంత్రాలలో రెండు రోజులకోసారి నోట్లను నింపాల్సి ఉండగా.. ఐదు రోజులకోసారి నింపుతున్నారు. రానున్న పండుగ సమయంలో రక్షణ సిబ్బంది లేక నోట్లను నింపడం ఆగిపోవచ్చని భావిస్తున్నారు. కనుక ఏటీఎం కార్డు ఉంది కదా అని పండగ రోజు వరకూ ఆగకపోవడం బెటర్.

  • Loading...

More Telugu News