: దేశ రాజధానిలో మరో ఘాతుకం
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ముక్కు పచ్చలారని ఏడేళ్ల బాలికపై కామాంధుల కన్ను పడింది. స్థానికంగా ఉన్న మున్సిపల్ పాఠశాలలో చదువుతున్న బాలికను..అక్కడే అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం బాలిక అత్యాచారానికి గురైందని, ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..పాఠశాల సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘాతుకం గురించి తెలిసిన వెంటనే ఆగ్రహించిన స్థానికులు హింసకు పాల్పడ్డారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..పాఠశాల సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘాతుకం గురించి తెలిసిన వెంటనే ఆగ్రహించిన స్థానికులు హింసకు పాల్పడ్డారు.