: రేపు ఉత్తరాఖండ్ కు షిండే
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే రేపు ఉత్తరాఖండ్ పర్యటనకు వెళుతున్నారు. ఆ రాష్ట్రంలో కేంద్ర పారా మిలటరీ బలగాలకు సంబంధించిన బెటాలియన్ కేంద్రాలను ప్రారంభించనున్నారు. శశస్త్ర సీమబల్, బీఎస్ఎఫ్ బెటాలియన్లను ఉత్తరాఖండ్ లోని సీఎం విజయ్ బహుగుణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం సితార్ గంజ్ లో ప్రారంభిస్తారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, ఆర్మీ బేస్ క్యాంపులు ఉన్నాయి. తన పర్యటనలో భాగంగా షిండే ఉత్తరాఖండ్ లో వరద ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల వివరాలను తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతోనూ సమావేశమవుతారు.