: హిమాలయాల్లో భూకంపం వస్తే 8 లక్షల మంది బలే: మర్రిశశిధర్
భూకంపం తీవ్ర స్థాయిలో వస్తే ప్రాణ నష్టం భారీ స్థాయిలో ఉంటుంది. మరి భూకంపాలకు యాక్టివ్ జోన్ గా ఉండే హిమాలయ రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎక్కడైనా 8 శాతం తీవ్రతతో భూకంపమే వస్తే.. ఎనిమిది లక్షల మంది సమాధి అయ్యే ప్రమాదం ఉందని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. ఈ ప్రాంతంలో 1950కి ముందు నాలుగు భారీ భూకంపాలు సంభవించాయి.
1897లో షిల్లాంగ్, 1905లో కంగ్రా, 1934లో బీహార్, నేపాల్లో, 1950లో అసోంలో వచ్చిన భూకంపాలు రిక్టర్ స్కేలుపై 8 పాయింట్లకుపైనే నమోదయ్యాయి. ఇవి జన జీవితాన్ని చిన్నాభిన్నం చేశాయి. అయితే, 1950 తర్వాత ఆ ప్రాంతంలో భూకంపం రాలేదని, 8శాతం తీవ్రత భూకంపాలకు తగిన ఒత్తిడి నెలకొందని శశిధర్ రెడ్డి చెప్పారు. ఒకవేళ ఆ స్థాయిలో భూకంపమే వస్తే 8 నుంచి 9 లక్షల మంది మరణించే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. ఎప్పుడు ఎక్కడ అలాంటి భూకంపాలు వస్తాయో తెలియదని, ఈ నేపథ్యంలో భూకంపాలకు దారితీయని రీతిలో సమాజాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేయాల్సి ఉందని తెలిపారు.