: ఆర్టీపీపీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మె బాట పట్టడంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో, ఇందులో ఉన్న ఐదు యూనిట్ల ద్వారా ఉత్పత్తయ్యే 1050 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా అంధకారం నెలకొంది.