: భారత్-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ వేళ్లలో మార్పులు


ఈ నెల 13 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న వన్డే మ్యాచుల సమయాలను మారుస్తూ బీసీసీఐ ప్రకటన జారీ చేసింది. నిర్ణీత సమయానికి కంటే మ్యాచుల వేళలను ఒక గంట ముందుకు జరిపింది. డే అండ్ నైట్ మ్యాచులపై మంచు ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చిన వేళల ప్రకారం మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొదటి సెషన్, విరామం తర్వాత 5.45 నుంచి 9.15 వరకు రెండో సెషన్ జరగనుంది.

  • Loading...

More Telugu News