: రెండో రోజుకు చేరిన జగన్ దీక్ష
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్ చేస్తున్న దీక్ష రెండో రోజుకు చేరుకుంది. లోటస్ పాండ్ లోని తన నివాసంలో జగన్ చేస్తున్న దీక్షకు మద్దతుగా పలువురు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు దీక్షలో కూర్చున్నారు. సీమాంధ్ర జిల్లాల నుంచి పలువురు కార్యకర్తలు దీక్షాస్థలికి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు.