: మరో లైంగిక వేధింపుల కేసులో ఆశారాం బాపు
ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపు మరో లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నారు. గుజరాత్ లోని సూరత్ లో ఆశారాం బాపు, ఆయన కుమారుడు నారాయణ్ సాయిపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. తమపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఇద్దరు సోదరీమణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆశారాం 16ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే.