: శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రానికి తాకిన సమైక్య సెగ
సీమాంధ్రకు చెందిన విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తుండడంతో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కాగా చీఫ్ ఇంజనీర్ శ్రీశైలం ఏపీజెన్ కో ఉద్యోగులతో చర్చలు జరుపుతున్నారు.