: బాబ్లీ ప్రాజెక్టు రాష్ట్రానికి చేటు కాదు: ముఖ్యమంత్రి
బాబ్లీ ప్రాజెక్టుతో రాష్ట్రానికి ఎటువంటి నష్టం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రకు చెందాల్సిన నీటినే వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని ఆయన అన్నారు. సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి పోలవరం టెండర్లపై అనవసర రాద్ధాంతం తగదని చెప్పారు.
ప్రజాభిప్రాయ సేకరణ కోసం పోలవరం ప్రాజెక్టును నిలిపి వేయాలన్న లేఖను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా పోలవరంపై హైపవర్ కమిటీ నివేదిక రాలేదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
చిదంబరం ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక బడ్జెట్ చాలా బాగుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. రైల్వే బడ్జెట్ కూడా భేషుగ్గా ఉందని..ఇప్పుడు ప్రారంభమైన రైల్వే ప్రాజెక్టులు మరో 30 ఏళ్లయినా పూర్తవ్వవని ఆయన అన్నారు.