: బ్రెస్ట్ క్యాన్సర్‌కు కొత్త వైద్యం
మహిళలను వేధించే వ్యాధుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఈ వ్యాధితో బాధపడేవారికి సరికొత్త వైద్యాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇంజక్షన్ ద్వారా మందును ఇవ్వడం వల్ల వ్యాధిగ్రస్తుల్లో ఉపశమనాన్ని కలిగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడేవారికి సాధారణంగా క్యాన్సర్ వ్యాధి నివారణకు వాడే మందుల వల్ల శారీరకంగా అంతులేని బాధను అనుభవించాల్సి ఉంటుంది. అలాకాకుండా శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త విధానం ద్వారా రోగులు బాధను అనుభవించకుండా ఉపశమనాన్ని కలిగించవచ్చు. చనుమొనలకు ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వక్షోజాల్లోని క్షీరవాహికలకు నేరుగా అందేలా సూదిమందు ఇవ్వడమే ఈ కొత్త విధానమని ఈ పరిశోధనకు నేతృత్వం వహిచిన డాక్టర్ సిల్వా క్రాసే చెబుతున్నారు. క్యాన్సర్ వ్యాధి నివారణకు ప్రస్తుతం ఉన్న కీమోథెరపీ, ఇతరత్రా మందులు కాలేయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కానీ ఈ కొత్త విధానం ద్వారా రోగులు బాధనుండి ఉపశమనాన్ని పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.