: తిరుగుతున్న 'కృష్ణ బిలం'..తొలిసారి గుర్తించిన శాస్త్రవేత్తలు!
అనంత విశ్వంలో నక్షత్రాలు, పాలపుంతలు మరెన్నో గ్రహా శకలాలను మనిషి గుర్తించాడు. అయితే వాటన్నిటినీ తనలో ఇముడ్చుకోగల శక్తి ఉన్న కృష్ణ బిలాల (బ్లాక్ హోల్స్) పై మాత్రం మానవులకు తెలిసింది తక్కువే.
అయితే తొలిసారిగా తిరుగుతున్న కృష్ణ బిలాన్ని చిలీ దేశంలోని పారనల్ అబ్జర్వేటరీలోని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎన్జీసీ 1365 గా పిలిచే ఈ కృష్ణ బిలం చాలా వేగంగా (న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం కన్నా 84 శాతం అధిక వేగంతో) తిరుగుతోందని వారు తెలిపారు. తాజాగా ఎన్జీసీ 1365 కృష్ణ బిలంపై పరిశోధనలు ముమ్మరం చేసిన శాస్త్రవేత్తలు..కృష్ణ బిలాలు తిరగడం అనే అంశంపై ధృడమైన అభిప్రాయాలకు రావచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు పాలపుంత (నక్షత్రాల గుంపు) చనిపోయిన తర్వాత కృష్ణ బిలంగా మారుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాటికి దగ్గరగా వచ్చే ప్రతి వస్తువును, పదార్థాన్ని ఆకర్షించి తనలో బందీగా మార్చే శక్తి వీటి సొంతం. ఇప్పటి వరకు కృష్ణబిలాలు తిరగడం గురించి కొన్ని సార్లు విన్నా కూడా వాటిపై నిర్థిష్ట అభిప్రాయానికి రాలేకపోయామని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఎన్జీసీ 1365 తమకు
కృష్ణబిలాలపై మరిన్ని వివరాలు తెలియజేయగలదని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.