: సీఎం ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలి: పాల్వాయి
ముఖ్యమంత్రి కిరణ్ పై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ తెలంగాణ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రం విడిపోయిందని.. ఇప్పటికైనా సీఎం వాస్తవాలు వెల్లడించాలని హితవు పలికారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పెంచి పోషించకుండా, ఇకపై సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ ఆధిపత్యం కోసం మూడు సామాజిక వర్గాల మధ్య పోరు జరుగుతోందని పాల్వాయి ఆరోపించారు.