: ఉగ్రవాదులు అల్ ఉమా సంస్థకు చెందినవారు: డీజీపీ


చిత్తూరు జిల్లా పుత్తూరులో 11 గంటల సుదీర్ఘ కమాండో ఆపరేషన్ తర్వాత పట్టుబడ్డ ఉగ్రవాదులు నిషిద్ధ అల్ ఉమా తీవ్రవాద సంస్థకు చెందినవారని డీజీపీ ప్రసాదరావు వెల్లడించారు. హైదరాబాదులో ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, బెంగళూరులో బీజేపీ కార్యాలయం ఎదుట జరిగిన పేలుళ్ళకు కారకులు వీరేనని తెలిపారు. అంతేగాకుండా, 2011లో మధురైలో అద్వానీ పర్యటన సందర్భంగా పేలుళ్ళకు కుట్ర పన్నారని, ఈ మేరకు వీరిపై కేసు నమోదైందని చెప్పారు. కాగా, పుత్తూరు లాంటి ఘటనల్లో స్థానికుల సహకారం ఎంతో అవసరమని డీజీపీ స్పష్టం చేశారు. సంఘ విద్రోహక శక్తుల ఆగడాలను అడ్డుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News