: గుత్తా జ్వాలపై నిషేధం విధించాలని సిఫార్సు
స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలపై ఐబీఎల్ (ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్) వేటు వేయనుందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. జ్వాలపై జీవితకాల నిషేధం విధించాలంటూ బ్యాడ్మింటన్ అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ ఐబీఎల్ కు సిఫార్సు చేసింది. ఈ ఏడాది జరిగిన తొలి అంచె ఐబీఎల్ మ్యాచ్ లలో తాను ప్రాతినిధ్యం వహించిన ఢిల్లీ జట్టులోని కొంతమంది ఆటగాళ్లను బంగా బీట్స్ పై ఆడకుండా ఆపేందుకు జ్వాల ప్రయత్నించిందని కమిటీ తన ఫిర్యాదులో పేర్కొంది. కాబట్టి, జీవితకాలం కానీ లేదా కొంతకాలం పాటు జ్వాలను సస్పెండ్ చేయాలని కోరినట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధికారి తెలిపారు. అయితే, ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.