: త్వరలో స్వదేశానికి పర్వేజ్ ముషారఫ్
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ త్వరలో దుబాయి నుంచి పాకిస్థాన్ కు తిరిగిరానున్నట్లు ప్రకటించారు. 5 సంవత్సరాల పాటు విధించుకున్నస్వీయ బహిష్కరణ ముగియడంతో తిరిగి వస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు ముషారఫ్ దుబాయ్ లో ఆశ్రయం పొందారు.
త్వరలో పాక్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన పార్టీకి ప్రాతినిధ్యం వహించనున్నట్లు ఈ మాజీ సైనిక జనరల్ చెప్పారు. కాగా, పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితి అత్యంత దారుణ స్థితిలో ఉందని, అందుకే తాను తిరిగి వస్తున్నానని వివరించాడు. ముందుగా ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దేందుకే ప్రాధాన్యమిస్తానని పేర్కొన్నాడు.