: సీఎంకు సమైక్య సెగ
సీఎం కిరణ్ కు సమైక్య సెగ తగిలింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుపతి వచ్చిన ఆయనను అలిపిరి వద్ద సమైక్యవాదులు అడ్డుకునే యత్నం చేశారు. అయితే, పోలీసులు సకాలంలో స్పందించి వారిని చెదరగొట్టారు. అనంతరం ముఖ్యమంత్రి తిరుమల పయనమయ్యారు.