: బ్రిటీష్ యువరాజు హ్యారీ హత్యకు తాలిబన్ల విశ్వప్రయత్నం
బ్రిటిష్ యువరాజు హ్యారీ హత్యకు ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబన్ తీవ్రవాదులు కుట్ర పన్నారు. ఆయనను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ, తాలిబన్లు సఫలీకృతం కాలేదు. ఈ వివరాలను తాలిబన్ నాయకుడు ఖ్వారీ నస్రుల్లా ఓ పాకిస్థానీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. హ్యారీ బ్రిటీష్ దళాల తరపున ఆఫ్ఘాన్ లో పనిచేస్తున్నప్పుడు ఈ ప్రయత్నాలు చేసినట్టు ఖ్వారీ తెలిపాడు.
హ్యారీ ఆఫ్ఘనిస్థాన్ లో పనిచేస్తున్నప్పుడు ఆయనను బ్రిటీష్ యువరాజుగా కాక, అమెరికా కోసం పోరాడుతున్న ఒక సైనికుడిగానే చూశామని ఖ్వారీ అన్నాడు. ఆయనను చంపడానికి విశ్వప్రయత్నం చేసినప్పటికీ అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడని తాలిబన్ నేత తెలిపాడు. 2008-12 మధ్య కాలంలో ఆఫ్ఘన్ యుద్ధంలో హ్యారీ హెలికాప్టర్ పైలట్ గా పనిచేశారు.