: సోనియాపై జగన్ విసుర్లు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. కుమారుడు రాహుల్ ను ప్రధానిని చేసేందుకే సోనియా రాష్ట్ర విభజనకు పూనుకుందని మండిపడ్డారు. హైదరాబాదులోని తన నివాసం వద్ద ఆయన నేడు ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నేషనల్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అంశంపై సోనియా వ్యవహరించిన తీరు బాధాకరమని వ్యాఖ్యానించారు. ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నట్టుగా ఉందని జగన్ పేర్కొన్నారు. ఇక తన దీక్షపై మాట్లాడుతూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండుతోనే ఆమరణ దీక్షకు కూర్చున్నానని వివరించారు. హైదరాబాదు నుంచి వెళ్ళిపొమ్మంటే ఎక్కడికి వెళతారని ఆయన ప్రశ్నించారు.