: మంత్రి గంటా కార్యాలయం ధ్వంసం


సమైక్యవాదుల ఆగ్రహావేశాలను కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరే రుచిచూస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా అనకాపల్లిలో మంత్రి గంటా శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయంపై సమైక్యవాదులు దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కార్యాలయం బయట ఉన్న గంటా ఫ్లెక్సీలను వారు చింపేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానం పట్ల ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమం తీవ్రంగా ఉన్నా మంత్రులు, ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకుండా నాటకాలు ఆడుతున్నారని సమైక్యవాదులు విమర్శించారు.

  • Loading...

More Telugu News