: రెండు టీఎంసీలతో పోయేదేం లేదు: విద్యాసాగరరావు


బాబ్లీ ప్రాజెక్టుపై నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మాజీ చీఫ్ ఇంజనీర్ విద్యాసాగరరావు విమర్శించారు. మహారాష్ట్ర నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల  కేవలం రెండు టీఎంసీల నీరే మహారాష్ట్రకు వెళుతుందని ఆయన అన్నారు. దీనివల్ల తెలంగాణ ఏమంత నష్టపోదని విద్యాసాగరరావు చెప్పారు. కావాలనే కొందరు నేతలు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అసలు తెలంగాణకు పోలవరం  వంటి పెద్ద ప్రాజెక్టు వల్లే నష్టం వాటిల్లుతుందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News