: బొత్స సోదరుడి ఇంటిపై సమైక్యవాదుల దాడి
విజయనగరంలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సోదరుడు శ్రీనివాసరావు ఇంటిపై సమైక్యవాదులు దాడి చేశారు. ఇంట్లో భద్రపరిచిన కేబుల్ పరికరాలను ధ్వంసం చేశారు. దాంతో, పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై ఉద్యమకారులు రాళ్లు రువ్వారు.