: కాకినాడలో పళ్ళంరాజు నివాసం వద్ద ఉద్రిక్తత


కేంద్ర మంత్రి పళ్ళంరాజుపై సమైక్యవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవికి రాజీనామా చేయకుండా నాటకాలాడుతున్నారంటూ విద్యార్థులు, ఉద్యోగులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన నివాసాన్ని ముట్టడించారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో, రెచ్చిపోయిన సమైక్యవాదులు ముందుకువెళ్ళేందుకు యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఇద్దరు ఆందోళనకారులకు గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News