: ఆర్టీపీపీ, వీటీపీఎస్ లలో విద్యుదుత్పత్తి బంద్
రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని ఉద్యోగుల జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో 210 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అలాగే విజయవాడలోని వీటీపీఎస్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. దీంతో, వీటీపీఎస్ లో 1260 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయింది.