: జైల్లో లాలూ ఏ పని చేయబోతున్నాడు?


దాణా కుంభకోణంలో ఐదేళ్ల జైలు శిక్ష పడిన లాలూ ప్రసాద్ యాదవ్ ను రాంచీలోని బిస్రాముండా జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు జైలులో ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు లాలూ జైలులో అడుగుపెట్టడంతో... జైలు అధికారులు ఆయనకు ఏ పని అప్పగిస్తారో..? అన్న ఆసక్తి అందర్లోనూ నెలకొంది. దీనికి జైళ్ల శాఖ ఐజీ శైలేంద్ర భూషణ్ సమాధానం ఇచ్చారు. జైళ్లలో శిక్ష పడ్డ ఖైదీలు వారికి ఉన్న నైపుణ్యాలను బట్టి వృత్తిని ఎంచుకోవచ్చని తెలిపారు. దీన్నిబట్టి, న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న లాలూ... విద్యకు సంబంధించిన వృత్తిని ఎంచుకునే అవకాశమున్నట్టు తెలిపారు. ఈ మధ్యనే జైళ్లలో నిరక్షరాస్యులైన ఖైదీలకు విద్యాబోధన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో లాలూ... టీచర్ అవతారమెత్తే అవకాశం ఉంది.

అయితే, జైలు శిక్ష పడిన ఖైదీలు వారం రోజుల్లో పై కోర్టుకు అప్పీలు చేసుకునే వీలుంది. అప్పీలు చేసుకున్న ఖైదీలకు పనులు అప్పచెప్పరు. అప్పీలు చేసుకోకపోతే, ఖైదీ ఇష్టాఇష్టాలను బట్టి పనిని అప్పగిస్తారని ఐజీ తెలిపారు.

  • Loading...

More Telugu News