: క్షమాపణ చెప్పిన ఎంపీ హర్షకుమార్
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఏపీఎన్జీవోలపై దాడిచేసి, వీరంగం సృష్టించిన తన కుమారుల తరపున ఎంపీ హర్షకుమార్ క్షమాపణ చెప్పారు. తమ కుటుంబం కూడా ఉద్యమంలో పాల్గొంటుందన్నారు. ఉద్యమానికి సంఘీభావంగా తమ కళాశాలను ఎప్పుడో మూసివేశామని చెప్పారు. విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, ఎంపీలుగా కొనసాగుతూనే పార్లమెంటులో బిల్లును వ్యతిరేకిస్తామన్నారు.