: జగన్ దీక్షకు అనుమతి లేదంటున్న పోలీసులు
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు అనుమతి లేదని హైదరాబాదు పోలీసులు అంటున్నారు. అనుమతి లేకుండా దీక్ష చేయడం నేరమని వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా అరెస్టులకు కూడా వెనకాడబోమని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో లోటస్ పాండ్ లోని జగన్ నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు, జగన్ దీక్షను అడ్డుకుంటామని తెలంగాణ న్యాయవాదులు స్పష్టం చేశారు.