: విశాఖలో బంద్ తీవ్రం
తెలంగాణ నోట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై విశాఖ ప్రజలు మండిపడుతున్నారు. దీంతో వరుసగా రెండో రోజు బంద్ కొనసాగుతోంది. కేజీహెచ్ లో అత్యవసర సేవలు మినహా అన్ని వైద్యసేవలు నిలిచిపోయాయి. 12 రైతుబజార్ లను మూసేశారు. దేవరాపల్లి-పినపాక రహదారిని గిరిజన ఉపాధ్యాయులు దిగ్బంధించారు. హెచ్ పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ కంపెనీల చమురుకేంద్రాలు మూతపడ్డాయి. బంద్ కారణంగా 750 చమురు రవాణా ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చమురు రవాణా నిలిచిపోయింది.