: రెండో రోజు తీవ్రమైన బంద్... నిర్మానుష్యమైన అనంతపురం
తెలంగాణ నోట్ ను కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లాలో బంద్ రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఉదయానే ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ఆటోలు, ప్రైవేటు వాహనాలు నగరంలోకి రాకుండా అడ్డుకున్నారు. బంద్ కారణంగా నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులన్నీ బోసిపోయాయి. దుకాణాలు, వాణిజ్యసముదాయాలు, బ్యాంకులు, పెట్రోల్ బంక్ లు, ధియేటర్లు, ఏటీఎంలు కూడా బంద్ అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది.