: బొత్స ఇంటి వద్ద వరుసగా రెండో రోజూ ఉద్రిక్తత
విజయనగరం జిల్లా కేంద్రంలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇంటి వద్ద మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బొత్స ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బొత్స ఇంటి వద్ద ఈ ఉదయం నుంచే భారీగా పోలీసులను మోహరించారు. నాలుగంచెల భద్రత ఏర్పాటు చేసినా నిరసనకారులను నిరోధించేందుకు భాష్పవాయుగోళాలు ప్రయోగించాల్సి వస్తోంది. మరో వైపు గజపతినగరంలో బొత్స కుటుంబ సభ్యులకు సంబంధించిన సత్యాస్టోన్ క్రషర్ ను ఆందోళన కారులు ధ్వంసం చేశారు. నిన్న జరిగిన ఘర్షణల కారణంగా విజయనగరంలో ఏలూరు డీఐజీని ప్రత్యేక అధికారిగా నియమించారు. నిన్న జరిగిన ఆందోళనలపై కేసులు నమోదు చేశారు.